కరోనాతో కోరుట్ల వాసి దుబాయ్‌లో మృతి

రోనా పాజిటివ్‌గా తేలి చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన ఒకరు దుబాయ్‌లో చనిపోయారు. మృతుడు (48) కోరుట్ల వాసి. చాలా రోజుల క్రితం ఉపాధి వెతుక్కొంటూ దుబాయ్‌ వెళ్లిన ఈయన.. దుబాయ్‌లోని జెబలాలి కంపెనీలో పనిచేస్తున్నాడు. గత నెల 27వ తేదీన ఆరోగ్య సమస్యలతో దవాఖానకు వెళ్లగా.. కరోనా పాజిటివ్‌గా నివేదిక వచ్చింది. దాంతో ఆయనను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. చివరకు మంగళవారం ఉదయం చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.