దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా మరో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో ఈ ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరికి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన ఇద్దరిలో ఒకరేమో కోవిద్-19 యూనిట్‌లో పని చేస్తున్నారు. మరో మహిళా డాక్టర్.. బయోకెమిస్ట్రీ విభాగంలో పీజీ తృతీయ సంవత్సరం చదువుతోంది. మహిళా డాక్టర్ జూనియర్ డాక్టర్. అయితే వైద్యురాలు ఇటీవలే విదేశాలకు వెళ్లి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఇద్దరు ఎవరెవర్ని కలిశారు? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇక ఢిల్లీ ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీ బస్తీ దవఖానాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు వైద్యులకు కూడా కరోనా సోకింది.
మరో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్