హజ్ యాత్రలో పాల్గొనే ముస్లిం యాత్రికులకు సౌదీ ఆరేబియా కొత్త ఆదేశాలు జారీ చేసింది. యాత్ర చేయాలనుకునేవారు ప్రస్తుతం తమ బుకింగ్ ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని కోరింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ దేశం పేర్కొన్నది. యాజ్ యాత్రికుల భద్రత తమకు ముఖ్యమని, వైరస్ నియంత్రణలోకి వచ్చే వరకు యాత్రికులు తమ ప్లాన్‌ను రద్దు చేసుకోవాలని హజ్ మంత్రి మొహమ్మద్ బంటెన్ కోరారు. ఈ ఏడాది జూలే, ఆగస్టు నెలల్లో దాదాపు 20 లక్షల మంది మక్కాతో పాటు మదీనా యాత్రకు వెళ్లనున్నారు. అయితే వారంతా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సౌదీ కోరింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ఇప్పటికే ఉమ్రా రద్దు చేసినట్లు ఆ దేశం చెప్పింది. మక్కా, మదీనాతో పాటు రియాద్‌లోకి ప్రజల్ని ఎవర్నీ రానివ్వడం లేదని మంత్రి తెలిపారు.
హజ్ యాత్ర వాయిదా వేసుకోండి : సౌదీ ఆరేబియా