నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్షను అమలుచేసేందుకు కొత్త తేదీని ఖరారు చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం స్థానిక కోర్టును కోరింది. కేసులో చివరి దోషి పవన్‌కుమార్‌గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ తిరస్కరించిన నేపథ్యంలో బుధవారం ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దోషులకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలు ముగిసిపోయాయని కోర్టుకు తెలిపింది. దీనిపై గురువారంలోగా స్పందన తెలియజేయాలని అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా దోషులను ఆదేశించారు. నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది చేసిన వాదనను జడ్జి తోసిపుచ్చారు.