కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. సభ సజావుగా జరగకుండా ఆటంకం కలిగిస్తున్న ఈ ఏడుగురిపై స్పీకర్ ఓంబిర్లా చర్యలు తీసుకున్నారు. సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఈ ఏడుగురు ఎంపీలను ప్రస్తుత సెషన్ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో గౌరవ్ గోగోయ్, టీఎన్ ప్రతాపన్, డీన్ కురియాక్స్, మాణిక్ ఠాకూర్, బెన్నీ బెహ్నన్, గర్జిత్ అహ్లువాలియా, ఆర్. ఉన్నితన్ ఉన్నారు.
ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు